హైదరాబాద్ : కరోనా కారణంగా చాలామంది ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇంటికే పరిమితం కావడంతో శరీరంపై పెద్దగా శ్రద్ద వహించడం లేదు. దీంతో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీలో ఇలాంటి సమస్యలు అనిపిస్తే జీర్ణపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని అర్ధం చేసుకోవచ్చు. నీరసంగా ఉండటం, చర్మ సంబంధమైన సమస్యలు తెలెత్తడం, ఆందోళనగాను, చికాకుగాను ఉండటం, తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడటం, నోటి దుర్వాసన, చేసే పనిపై దృష్టి నిలపలేకపోవడం, రాత్రి సమయంలో నిద్రపట్టక పోవడం వంటి సమస్యలు తరచుగా కలుగుతుంటే మీరు జీర్ణసంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారని అర్ధం చేసుకోవచ్చు. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Mon Jan 19, 2015 06:51 pm