బ్రసిలియా: బ్రెజిల్లో కరోనా మహమ్మారి విళయతాండవం ఆడుతోంది. ఇక్కడ నిత్యం 50 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా బ్రెజిల్ వ్యాప్తంగా 57,152 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 28,59,073కు చేరింది. ఇక బ్రెజిల్లో గడిచిన 24 గంటల్లో 1,437 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 97,256గా ఉంది. మరో రెండు రోజుల్లో బ్రెజిల్లో మరణాల సంఖ్య లక్ష దాటే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఒక్క అమెరికాలో తప్ప మరే దేశంలో కూడా లక్షకు పైగా మరణాలు నమోదుకాలేదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కేసుల విషయంలోనూ బ్రెజిల్ అమెరికా తరువాతి స్థానంలోనే నిలిచింది. అయితే కరోనా కేసులు, మరణాల విషయంలో అమెరికా ఏ దేశానికి అందనంత ఎత్తులో ఉంది. అక్కడ దాదాపు 50 లక్షల కేసులు నమోదైతే.. మరణాలు లక్షా 60 వేలు దాటేశాయి.
Mon Jan 19, 2015 06:51 pm