విశాఖ: విశాఖ పోర్టులో అగ్నిప్రమాదంపై పోర్టు అధికారులు స్పందించారు. కోస్టల్ షిప్పింగ్ బోట్లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని పోర్టు ఉన్నతాధికారులు తెలిపారు. షిప్ క్యాబిన్ రూం నుంచి పొగలు రావడాన్ని సిబ్బంది గమనించి.. పోర్ట్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారని, పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాదాన్ని నివారించారని పేర్కొన్నారు. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని, ప్రమాదంలో ఎటువంటి అస్తి నష్టం జరగలేదని పోర్టు ఉన్నతాధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm