హైదరాబాద్ : సూపర్‌స్టార్ మహేశ్‌కు అపారమైన ఫ్యాన్ బేస్ ఉంది. వారు తలుచుకుంటే రికార్డుల క్రియేట్ చెయ్యడం, బద్దలు కొట్టడం పెద్ద కష్టమేమి కాదు. ఇక ఆదివారం మహేశ్ బర్త్ డే. ఫ్యాన్స్ అందరూ కలిసి గుర్తిండిపోయే గిఫ్ట్ ఇవ్వాలిగా. ఇచ్చేశారు. అలాంటి, ఇలాంటి గిఫ్ట్ కాదు. అల్టిమేట్ గిఫ్ట్ ఇచ్చారు. #HDBMaheshBabu ట్యాగ్‌తో సోషల్ మీడియాలో వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు మహేష్ అభిమానులు. 60.2 మిలియన్ ట్వీట్లతో అతి పెద్ద ట్రెండ్ క్రియేట్ చేశారు. 1.28 లక్షల అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా సరికొత్త రికార్డే. కాగా సోషల్ మీడియా ద్వారా పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలందరూ మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని మహేష్ బాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జన్మదినం సందర్భంగా ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సరికొత్త సందేశం ఇచ్చారు మహేష్ బాబు. గ్రీన్ ఇండియా దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కాగా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మహేష్ కొత్త సినిమా సర్కారు వారిపాట మోషన్ పోస్టర్ కు విశేష స్పందన లభించింది.
Mon Jan 19, 2015 06:51 pm