హైదరాబాద్ : ఈ ఏడాది శబరిమల యాత్రకు భక్తులను అనుమతిచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేరళ సర్కారు. దర్శనాలను కరోనా నిబంధనలను అనుసరించి నిర్వహిస్తామని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి కదకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు. నవంబర్ 16న యాత్ర ప్రారంభమవుతుందని, స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తమకు కరోనా లేదని నిరూపించే కొవిడ్-19 సర్టిఫికెట్ ను తప్పనిసరిగా సమర్పించాల్సి వుంటుందని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ల్యాబుల్లో మాత్రమే భక్తులు పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుందని అన్నారు. దర్శనానికి వచ్చే భక్తులందరినీ స్క్రీనింగ్ చేస్తామని, సన్నిధానం, నీలక్కల్, పంబ ప్రాంతాల్లోని హాస్పిటల్స్ లో మరిన్ని సౌకర్యాలను సిద్ధం చేస్తామని తెలిపారు. పంబ, నీలక్కల్ మధ్య తిరిగే బస్సుల్లోనూ భౌతికదూరాన్ని తప్పనిసరి చేస్తామని తెలిపారు. అలాగే విపత్తు నిర్వహణల్లో భాగంగా హెలికాఫ్టర్ ను అందుబాటులోకి ఉంచనున్నట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Aug 11,2020 01:44PM