హైదరాబాద్ : వరుసగా పెరుగుతూ సామాన్యుడు అందుకోనంత ఎత్తుకు దూసుకెళ్లిన బంగారం ధర క్రమంగా కిందకు దిగుతోంది. ఆల్‌టైం హై రికార్డులు సృష్టించిన పడిసి ధర.. నాలుగు రోజులుగా పడిపోతోంది... నిన్నటి వరకు వందల్లో తగ్గగా.. ఇవాళ ఏకంగా వేలల్లో పడిపోయింది. పసిడి ప్రేమికులకు శుభార్త చెబుతూ రూ.3వేలకు పైగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3350 క్షీణించి రూ.54,680కి పడిపోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3010 పడిపోయివడంతో రూ.50,130కు దిగివచ్చింది. అయితే, పసిడి ధర పడిపోయినా వెండి కాస్త పైకి కదిలింది.. రూ.50 పెరగడంతో.. కిలో వెండి ధర రూ.72,550కు చేరింది.
Mon Jan 19, 2015 06:51 pm