హైదరాబాద్ : గూగుల్ ప్లేస్టోర్ నుంచి PAYTM యాప్ తొలగించబడిన సంగతి తెలిసిందే. గ్యాంబ్లింగ్‌ను ప్రమోట్ చేస్తుండటం వల్ల ఈ యాప్‌ను తొలిగించామని గూగుల్ స్పష్టం చేసింది. ఇక దీనిపై తాజాగా పేటీఎం స్పందించింది.PAYTM ఆండ్రాయిడ్ యాప్ తాత్కాలికంగా గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉండదు. కొత్తగా డౌన్లోడ్ చేసుకోవడానికి, అప్డేట్లకు ప్రస్తుతానికి అవకాశం లేదు. త్వరలోనే మళ్లీ యాప్ అందుబాటులోకి వస్తుంది. పేటీఎం యూజర్ల డబ్బులు భద్రంగానే ఉన్నాయి.. ఎప్పటిలానే లావాదేవీలు చేసుకోవచ్చునని పేటీఎం ట్విట్టర్లో పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm