ये जो निर्दयी सिपाही दिख रहा,देखो कैसे वर्दी की हनक दिखा रहा है,गरीब दिव्यांग को किस तरह धक्का देकर जमीन पर गिराकर, पीटकर लहूलुहान किया, #गर्भवती पत्नी रोती बिलखती रही लेकिन इस निर्दयी सिपाही को दया तक नहीं आई,कन्नौज के सौरिख के सदर बाजार का मामला. @Uppolice pic.twitter.com/kLTJf9SCpK
— Yogita Bhayana (@yogitabhayana) September 18, 2020
హైదరాబాద్: ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఓ పోలీసు కానిస్టేబుల్.. మానవత్వం మరిచి దివ్యాంగుడితో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని కానూజ్ జిల్లాలో చోటుచేసుకుంది. యోగితా భయానా అనే సోషల్ యాక్టివిస్ట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెండు నిమిషాలకు పైగా నిడివి గల ఆ వీడియోలో దివ్యాంగుడితో కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడు. అతన్ని లాక్కొని రావడమే కాకుండా కిందరకు తోసేశాడు. అక్కడ ఉన్న మిగతా పోలీసులు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారే తప్ప ఆపేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో.. ఆ పోలీసు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో చర్యలకు ఉపక్రమించిన కానూజ్ జిల్లా పోలీసు యంత్రాంగం అతని సస్పెండ్ చేయడంతోపాటు.. ఆ ఘటనపై విచారణకు ఆదేశించింది. కాగా, ఈ ఘటన బాధితుడు స్పందిస్తూ.. తాను రిక్షా పుల్లర్నని రోడ్డు పక్కన ఉన్న ప్రయాణికులను పికప్ చేసుకుంటున్న సమయంలో కానిస్టేబుల్ తనపై దాడికి దిగడానికి చెప్పాడు. కానిస్టేబుల్ మాత్రం.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని అన్నందుకు ఆ దివ్యాంగుడు తనను దూషించాడని తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించి కానూజ్ పోలీసు యంత్రాంగం ట్విటర్ ఓ పోస్ట్ కూడా పెట్టింది. పోలీస్ స్టేషన్లో వికలాంగుడిపై దాడి జరగడం దురదృష్టకరమని.. ఇందుకు కారకులపై ఎస్పీ కఠిన చర్యలకు ఆదేశించారని తెలిపింది.