Speechless! #Superhuman pic.twitter.com/XIZEy7hy8Y
— Vibhinna Ideas (@Vibhinnaideas) September 19, 2020
హైదరాబాద్ : కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా మందికి వావ్ అనే ఫీల్ కలుగుతుంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ వ్యక్తి చిన్నారి ప్రాణాలను కాపాడిన తీరు.. అద్భుతం అనిపించక మానదు. అసలు ఆ వీడియోలో ఏముదంటే.. ఓ చిన్నారిని తల్లి ఆడించడానికి ఊయలలాంటి చక్రలు కలిగిన బండిలో ఉంచింది. అదికాస్త రోడ్డు మీదకు దూసుకుని వచ్చింది. అయితే అదే సమయంలో బైక్‌పై వచ్చిన వ్యక్తి ఆ దశ్యాన్ని గమనించి.. బైక్‌ను కింద పడేశాడు. ఆ తర్వాత పరుగెత్తూ కుంటూ వెళ్లి చిన్నారిని రక్షించాడు. చిన్నారి బండి వెంట పరుగెత్తుకుంటూ వచ్చిన చిన్నారి తల్లి.. బైకర్‌కు థ్యాంక్స్ చెప్పి చిన్నారిని తీసుకుని వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఆ వ్యక్తిని సూపర్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చిన్నారి బండి జారుకుంటూ వెళ్తున్న వైపు లోయ మాదిరి ఉందని.. ఒకవేళ బైక్‌పై వచ్చిన వ్యక్తి తక్షణమే స్పందించడంతో పెను ప్రమాదం సంభవించేదని అంటున్నారు.