హైదరాబాద్: పుదుచ్ఛెరీలోని నెట్టపాక్కంలో ఓ జంట ట్రక్కును రాంగ్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయబోయి టైర్ల కింద పడ్డారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ట్రక్కు రోడ్డు పక్కన ఉన్న ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీలోకి తిరుగుతున్న సమయంలో బైకర్ దాన్ని ఓవర్ టేక్ చేయబోయాడు. ఈ విషయం తెలియని డ్రైవర్ ఆగకుండా ట్రక్కును ముందుకు నడిపాడు. దీంతో ట్రక్కు ముందు టైర్లు వారి మీదకు ఎక్కాయి. దంపతులిద్దరూ తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm