హైదరాబాద్ : బీహార్లోని తిరువారుర్ వద్ద ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకైంది. పంట పొలాల నడుమ ఉన్న పైప్ లైన్ పగిలి.. భారీగా గ్యాస్ లీకవుతోంది. గ్యాస్ లీకేజీ గురించి తెలిసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. చుట్టుపక్కల కిలోమీటర్ పరిధి వరకు గ్రామంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. గ్యాస్ లీకైందన్న సమాచారం అందిన వెంటనే.. స్థానికంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు స్థానిక మహిళ ఒకరు చెప్పారు. గ్యాస్ స్టవ్స్ కూడా వెలిగించవద్దని, చెక్కలను మండించవద్దని చెప్పినట్టు తెలుస్తోంది. గ్యాస్ లీకేజీ సమాచారంతో అప్రమత్తమైన ఓఎన్జీసీ అధికారులు అవసరమైన పరికరాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయిల్ లీకైన ప్రాంతాన్ని గుర్తించారు. లీక్ జరిగిన ప్రాంతంలో మరమ్మత్తులు చేశారు. అయితే ప్రతిసారి ఇదే ప్రాంతంలో అయిల్ లీక్ అవడానికి గల కారణాలను వెతుకుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm