విశాఖపట్నం: విశాఖలో యువతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఓ యువతి మూడు అంతస్తుల పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అపార్ట్మెంట్లో పెద్ద శబ్దం రావడంతో గమనించిన అపార్ట్మెంట్ వాసులు యువతి కింద పడి ఉండటంతో వెంటనే కుటుంబసభ్యులతో కలిసి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రి చేరుకునే సరికి యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm