హైదరాబాద్ : సురక్షితమైన రహదారి మౌలికసదుపాయాల ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పాటుపడుతున్న గుర్తింపు పొందిన సామాజిక సేవా సంస్థ ద ఇంటర్నేషల్ రోడ్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (ఐఆర్ఏపీ), ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ రవాణా కంపెనీ, FedEx Corp. (NYSE: FDX) అనుబంధ సంస్థ అయిన FedEx Express భాగస్వామ్యంతో 5-స్టార్ గ్లోబల్ కనెక్షన్స్ ఇనీషియేటివ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్ భారత్‌లో భాగస్వామ్యాల సత్తాను వెలికితీయడంతో పాటు 100కు పైగా దేశాల్లో తమ సొంత ఆర్ఏపీ ప్రోగ్రామ్ ఇంకా ప్రాజెక్టు కార్యకలాపాలు కలిగిన వారితో విజవంతమైన ఫలితాలను పంచుకోవడానికి దోహదం చేస్తుంది. 5-స్టార్ రోడ్డు భద్రత రేటింగ్ వ్యవస్థ అలాగే రహదారి వినియోగదారులు అందరికీ మెరుగైన రహదారుల కోసం 3-స్టార్‌కు అనుకూలంగా మద్దతు అంశాల్లో ఐఆర్ఏపీ ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. ఈ కొత్త కార్యక్రమం ప్రపంచ మొత్తంలో 100కు పైగా ఐఆర్ఏపీ అనుబంధ సంస్థలతో అనుసంధానమై సేవలు అందించనుంది. తద్వారా ఆయా సంస్థలు మెరుగ్గా సమాచారాన్ని చేరవేయడం, నెట్వర్క్ ఇంకా సహకరించేందుకు వీలు కలుగుతుంది.
ఈ కార్యక్రమాన్ని 4 దశల్లో అమలు చేస్తారు.
100కు పైగా దేశాలు 14,000 భాగస్వామ్య సంస్థలతో విజయవంతమైన ఫలితాలను పంచుకోవడం అలాగే ప్రోగ్రామ్‌ను స్టోర్ మరియు ట్రాక్ చేసేందుకు వీలుగా గ్లోబల్ పార్ట్నర్ మేనేజ్మెంట్ సిస్టమ్‌గా వ్యవహరించే ఐఆర్ఏపీ అనుసంధానాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అధిక ప్రభావవంతమైన స్థానిక ఆర్ఏపీల కోసం సిస్టమ్, దాని డేటా పరిజ్ఞానాలను ఉపయోగించుకొని ప్రజలు మరియు వనరులను అనుసంధానం చేయడం కోసం 5-స్టార్ గ్లోబల్ కనెక్షన్స్ వ్యూహాన్ని అమలు చేస్తారు. ఈ కొత్త గ్లోబల్ సిస్టమ్, 5-స్టార్ కనెక్షన్స్ వ్యూహాలను ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, పరిశ్రమ భాగస్వాములకు మద్దతివ్వడంపై దృష్టిసారిస్తూ భారత్‌లో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టడం జరుగుతుంది. మూడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా అత్యంత రిస్కుతో కూడిన రోడ్లకు పరిష్కారం కోసం ప్రారంభించిన ఇండియాఆర్ఏపీ ప్రోగ్రామ్‌లో భాగంగా ఖీవసజుఞ మద్దతుతో ప్రయోగాత్మకంగా దీన్ని ఆరంభిస్తారు. 3-స్టార్ మరియు మెరుగైన రహదారుల కోసం యూఎన్ ప్రపంచ లక్ష్యాలను సాధించి తద్వారా ఇతర దేశాలు కూడా దీన్ని అనుసరించడం కోసం ఒక కార్యాచరణను రూపొందించేందుకు భారత దేశ వ్యాప్తంగా ప్రాజెక్టులకు మద్దతివ్వడానికి ఒక ప్రాముఖ్యం కలిగిన విజయవంతమైన ప్యాకేజీని అభివృద్ధి చేస్తారు.
ఈ కార్యక్రమంపై FedEx Express మధ్య ప్రాచ్యం, భారత్ ఉపఖండం, ఆఫ్రికా (ఎంఈఐఎస్ఏ) రీజినల్ ప్రెసిడెంట్ జాక్ మూస్ మాట్లాడుతూ... ఎంతో ప్రధానమైన ఈ రహదారి భద్రత కార్యక్రమానికి మద్దతివ్వడం మాకు గర్వకారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2020 నాటికి రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలు హెచ్ఐవీ/ఎయిడ్స్, మలేరియా మరియు ట్యూబర్క్యులోసిస్ వల్ల చోటుచేసుకుంటున్న మరణాలను మించిపోనున్నాయి. అందుకే FedEx చేయూతతో ప్రజలు మరియు అవకాశాలను అనుసంధానం చేయడంపై దృష్టి పెట్టడం ద్వారా మేము ఈ పరిస్థితులను మార్చడంలో సహకరించగలమని భావిస్తున్నాం. ఐఆర్ఏపీ 5-స్టార్ గ్లోబల్ కనెక్షన్స్ కార్యక్రమానికి FedEx మద్దతు అందిస్తుంది. అలాగే ఇండియాఆర్ఏపీకి స్థానిక FedEx చేయూతనిస్తుంది. తద్వారా సురక్షితమైన రహదారులు ఇంకా ప్రాణాలను కాపాడటం కోసం పాటుపడుతున్న భాగస్వాములందరినీ సంఘటితం చేసేందుకు మా వంతు సహకారాన్ని అందించనున్నాం అని పేర్కొన్నారు. ఐఆర్ఏపీ 5-స్టార్ గ్లోబల్ కనెక్షన్స్ ఇప్పటికే అభివృద్ధి దశలో ఉంది అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో ఐఆర్ఏపీ భాగస్వాముల కార్యకలాపాలను అనుసంధానం చేస్తోంది. ఈ కార్యక్రమం భాగస్వాములు, కార్యకలాపాలు, ప్రాజెక్టులు, రోడ్డు అంచనాలు మరియు మెరుగుదల, గణాంకాలు, శిక్షణ మరియు గుర్తింపు కార్యకలాపాలు, పరిజ్ఞానం మరియు వార్తలను వివిధ దేశాలతో అనుసంధానం చేస్తోంది. 5-స్టార్ గ్లోబల్ కనెక్షన్స్ అనేది సామాజిక సేవపై ప్రభావం చూపడంలో వినూత్న ఆలోచన(గేమ్ ఛేంజర్)గా నిలుస్తుంది. అలాగే ప్రయోగాత్మకంగా ఎంచుకున్న భారత్‌లో దీని తొలి ఫలితాలను చూడనున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రతి గంటకూ 17 రోడ్డు ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయిణ అని ఐఆర్ఏపీ గ్లోబల్ ప్రోగ్రామ్ మేనేజర్ జూడీ విలియమ్స్ చెప్పారు. ఈ కార్యక్రమానికి FedEx Express మద్దతు అందిస్తుండటం మాకెంతో ఆనందం కలిగిస్తోంది. ఇండియాఆర్ఏపీ ప్రోగ్రామ్ కోసం సమాచారం, ఆచరణ మరియు ఫలితాలను ఉపయోగించుకోవడానికి భారత్‌లో కార్యకలాపాల కోసం ఈ ఆలోచనలు, సామర్థ్య ప్రయోజనాలను అమలు చేయడానికి మేం చాలా ఉత్సాహంగా ఉన్నాం. దీనివల్ల సురక్షితమైన రహదారులు, రోడ్డు ప్రమాదాల తగ్గింపు మరియు మరిన్ని భారతీయ కుటుంబాలను సురక్షితంగా వారి ఇళ్లకు చేరుకునేలా చేయడమే ఈ కార్యక్రమం వాస్తవ ఉద్దేశం. గతేడాది FedEx తన గ్లోబల్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్, FedEx కేర్స్ 50 - 50లో తదుపరి దశలను ప్రకటించింది. దీనిద్వారా 2023లో కంపెనీ 50వ వార్షికోత్సవం నాటికి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రజలపై సానుకూల ప్రభావం చూపాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 28,2020 05:36PM