హైదరాబాద్ : వినియోగదారుల సౌకర్యం మరియు సురక్షత కొలమానాలను వృద్ధి చేసే దిశలో ఫోర్డ్ ఇండియా వాహనాల యజమానులకు తమ ఫోర్డ్ వాహనాల సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చే దిశలో డోర్‌స్టెప్ సర్వీస్‌ను పరిచయం చేయడం ద్వారా ఇల్లు లేదా కార్యాలయం వద్దే ఎటువంటి అదనపు రుసుం చెల్లించే అవసరం లేకుండానే ఈ సేవలను పొందవచ్చు. ఈ సరికొత్త ఆఫర్ ఫోర్డ్ తన డయల్-ఎ-ఫోర్డ్ సేవల్లో భాగంగా ప్రారంభించిన వినియోగదారుల-కేంద్రిత కార్యక్రమాల శ్రేణిని విస్తరిస్తూ, ఇందులో విక్రయం మరియు సేవల విచారణను హెల్ప్‌లైన్ ద్వారా ఆలకిస్తోంది.
తన మొదటి దశలో కంపెనీ ఈ దిగువ పేర్కొన్న నగరాల్లో డోర్‌స్టెప్ సర్వీసులను ప్రారంభించింది:
(ఉత్తరం) ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఘాజియాబాద్, ఫరీదాబాద్, జైపూర్, లక్నో
(దక్షిణం) బెంగళూరు, చెన్నై, కొచ్చి మరియు త్రివేండ్రం, హైదరాబాద్
(తూర్పు) కోల్కత్తా, భువనేశ్వర్
(పశ్చిమం) ముంబయి, థానే, పుణె, ఔరంగాబాద్, అహ్మదాబాద్
పైన పేర్కొన్న నగరాల్లో ఉంటున్న ఫోర్డ్ వినియోగదారులు డోర్‌స్టెప్ సర్వీస్‌కు బుక్ చేసి, అనంతరం సమీపంలోని ఫోర్డ్ డీలర్‌షిప్‌కు డయల్-ఎ-ఫోర్డ్ టోల్-ఫ్రీ సంఖ్యకు ఫోన్ చేసి, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. శిక్షణ పొందిన ఫోర్డ్ నిణుపులతో నిర్వహించే డోర్ స్టెప్ సర్వీస్‌లో అవసరయ్యే వాహనం చెకప్‌లు, ఫిల్టర్లు తదితర విడి భాగాల మార్పు, ఆయిల్ మార్పు మరియు డ్రై వాషింగ్ తదితరాలు ఈ సర్వీస్‌లో కలిసి ఉంటాయి. వినియోగదారులకు సర్వీస్ అనంతరం ఆన్లైన్లో చెల్లింపులను చేసే అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యలకు సాంకేతిక నిపుణుల బృందం వాహనాన్ని సమీపంలో ఉన్న సర్వీస్ సెంటర్‌కు తీసుకు వెళతారు.
డోర్‌స్టెప్ సర్వీస్‌ను వినియోగదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే అందిస్తారు.
కుటుంబం నిరంతరం పనులను సరళీకృతం చేసుకునేందుకు మరియు మీ సంతోషాలకు సంబంధించిన ప్రతి వివరం గురించి సంరక్షణ వహించేందుకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. కుంటుంబం తరహాలోనే ఫోర్డ్ సదా మీ వైపు ఉంటుంది మరియు డోర్‌స్టెప్ సర్వీస్ మా వినియోగదారులకు సేవలను అందించడంలో మా దృఢమైన నిబద్ధతకు మరొక ఉదాహరణ అని ఫోర్డ్ ఇండియా సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ రైనా తెలిపారు. ఫోర్డ్ పలు ఆవిష్కరణలు మరియు వినూత్న కార్యక్రమమైన సర్వీస్ ప్రైస్ కాలుక్యులేటర్‌తో తన వినియోగదారుల విశ్వాసాన్ని ఆవిష్కరించడంలో సదా ముందంజలో ఉండగా, ఇది వారికి తమ కారు సర్వీస్ మరియు విడిభాగాల ఖర్చును డీలర్‌షిప్‌కు వెళ్లేందుకు ముందుగానే తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 28,2020 05:42PM