సూర్యాపేట: జిల్లాలోని కోదాడలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. కాగా ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాజస్థాన్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న లీలాదరి ట్రావెల్స్ ప్రైవేటు బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఆపై రోడ్డు వెంబడి ఉన్న ఇంట్లోకి దూసుకుపోయింది. రెండు విద్యుత్ స్తంభాల మధ్యలో నుంచి బస్సు ఇంటిలోకి దూసుకెళ్లింది. కాగా ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm