నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు 14 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో ,అవుట్ ఫ్లో 1,57,358 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 311.7462 టీఎంసీలుగా నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను...ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులకు చేరింది.
Mon Jan 19, 2015 06:51 pm