హైదరాబాద్ : భారతీయులకు దీపావళి చాలా పెద్ద పండుగ. వెలుగులు విరజిమ్మే ఈ పండుగ ప్రతీ ఒక్కరి జీవితంలో ఆనందమయం కావాలని కోరుకుంటారు. అందుకే ఆత్మీయులకు, తమ దగ్గర ఉండేవారికి బహుమతులు అందిస్తుంటారు. అలాంటి దీపావళి పండుగను మరింత అందంగా, ఆనందంగా జరుపుకునేందుకు… అంతర్జాతీయ స్థాయిలో స్మార్ట్‌ఫోన్ అనగానే అందరికి గుర్తుకు వచ్చే OPPO.. ఇప్పుడు #BeTheLight To Spread the Light అనే కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది. అంతేకాదు... ఈ దీపావళి పండుగ సందర్భంగా.. దీపావళి ఎడిషన్‌గా F17 Proను లాంచ్ చేసింది. భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్... దీపాల వెలుగుల నుంచి ప్రేరణ పొంది రూపొందించారు. అంతేకాకుండా OPPO F17 Pro కోసం ఒక అద్భుతమైన ప్రోమోను కూడా విడుదల చేశారు. OPPO F17 Pro ప్రోమో కాన్సెప్ట్‌ను పబ్లిసిస్ రూపొందించంది. ఈ ప్రోమోని అద్భుతమైన పర్వతాల దగ్గర చిత్రీకరించారు. ఇక ప్రోమో విషయానికి వస్తే.. ఒక చిన్న పిల్లాడు, చిన్న అమ్మాయి వచ్చే దీపావళికి కాకరపువ్వొత్తులు కాల్చాలని అనుకుంటారు. వారికి సగం కాలిపోయిన క్రాకర్ దొరుకుతుంది. దాన్ని వాళ్లు చాలా అపురూపంగా దాచుకుంటారు. కానీ ఆ పిల్లలిద్దరూ వారిదగ్గరున్న కాకరపువ్వొత్తిని పోగొట్టుకుంటారు. అయితే... ఈసారి దీపావళి పండుగ లేదా అని బాధపడుతున్న సమయంలో.. వారి లెక్కల టీచర్.. వారికి కాకరపువ్వొత్తుల్ని బహుమతిగా ఇస్తాడు. దీంతో వారు దీపావళి చాలా ఆనందంగా జరుపుకుంటారు.
ప్రోమోని ప్రధానంగా గమనిస్తే.. ఒక చిన్న కాకరపువ్వొత్తి.. ఆ చిన్నారుల మోముల్లో ఎలా ఆనందాన్ని తీసుకువచ్చిందో చూపించారు. ఈ బ్రాండ్ ప్రోమో ద్వారా చిన్నారుల భావోద్వేగాలను మరియు వారి అమాయకత్వాన్ని అద్భుతంగా చూపించారు. అంతేకాకుండా ఇతరుల జీవితాల్లో ఉండే చిన్న చిన్న ఆనందాల్ని తీర్చడమే అసలైన దీపావళి అనే సందేశాన్ని అందిస్తుంది. ఈ ప్రోమోతో OPPO.. #BeTheLight To Spread the Light క్యాంపెయిన్ అందరికి చేరువయ్యేలా చేసింది.
దీపావళి పండుగ ఆనందాన్ని మరింత పెంచుతూ... OPPO ఇవాళ దీపావళి ఎడిషన్ F 17 Proను విడుదల చేసింది. ఇది దీపావళి యొక్క స్ఫూర్తిని ప్రతీ ఒక్కరికి తెలియచేస్తుంది. అందుకే ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్ ప్రకాశవంతమైన రంగుల మిశ్రమాన్ని కలిగి ఉంది. ఈ హ్యాండ్సెట్ గతంలో కంటే సొగసైనదిగా కనిపిస్తుంది. దీపావళి పండుగ యొక్క ఇతివృత్తంతో ప్రేరణ పొందిన ఈ స్మార్ట్‌ఫోన్ బంగారం, ఆకుపచ్చ మరియు నీలం రంగుల కలయికను కలిగిఉంది. మరింత సంక్షిప్త మరియు ఏకీకృతం కోసం వెనుకవైపు మాట్టే ఆకృతితో కలిగి ఉంటుంది. ఇంకా, అద్భుతమైన డిజైన్ సున్నితమైన మరియు సన్నని దృశ్య ప్రభావాన్ని సృష్టిస్తుంది. దీనివల్ల రంగులు చాలా దట్టంగా కనిపించకుండా ఉంటాయి. అందరికి నచ్చే విధంగా స్మార్ట్‌ఫోన్ ఉండాలనే సందేశాన్ని వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో, OPPO ఈ దీపావళికి ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావాలని భావిస్తోంది. మూడు అధునాతన రంగులను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ అత్యంత ప్రాచుర్యం పొందిన షైనీ మాట్టే ఫినిష్ను కలిగి ఉంది. దీని సర్ఫేస్పై లైట్ పడినప్పుడల్లా మంత్రముగ్దులను చేస్తుంది. ఈ సరికొత్త రంగులతో F 17 Pro అందరికి అద్భుతంగా నచ్చుతుందని భావిస్తోంది.
భారతీయ మార్కెట్‌పై OPPOకి నిబద్ధత ఎక్కువ. అందుకే ముందే చెప్పినట్లుగా.. ఇండియా ఎక్స్‌క్లూజివ్ ఎఫ్ సిరీస్‌తో మిడ్ సెగ్మెంట్లో తన ఆవిష్కరణల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి, OPPO తన భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక బహుమతి బాక్స్‌ని సిద్ధం చేసింది. ఇందులో దీపావళి ఎడిషన్ F17 Proతో పాటు 10,000mAh OPPO పవర్ బ్యాంక్ మరియు అందమైన బ్యాక్ కవర్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ దీపావళి ఎడిషన్ F 17 Pro ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో రూ. 23,990 రూపాయల అద్భుతమైన ధర వద్ద అమ్మకానికి అందుబాటులో సిద్ధంగా ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 21,2020 05:12PM