విజయవాడ: విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. నవంబర్ 30 వరకు తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm