ప్రతిష్టాత్మక స్కాలర్షిప్, మెంటార్షిప్ కార్యక్రమం కోసం టాప్ 100 ఫైనలిస్ట్‌ల ప్రకటన
హైదరాబాద్: సంగీతం మరియు నృత్య విభాగాలలోని పలు శైలుల వ్యాప్తంగా జాతీయ స్థాయి ప్రతిభాపోటీ ‘సిఫ్ యంగ్ ఆర్టిస్ట్2020’ నేడు తమ టాప్ 100 ఫైనలిస్ట్‌ల జాబితాను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి భారతదేశవ్యాప్తంగా 12వేలకు పైగా ఎంట్రీలను కళారంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని కలలుగంటున్న 11 నుంచి 18 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థుల నుంచి అందుకుంది. ఈ సంవత్సరారంభంలో, ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయంగా ఖ్యాతిగడించిన మెస్ట్రోలు అమ్జాద్ అలీ ఖాన్, టెరాన్స్ లూయిస్, షోవానా నారాయణ్, షాల్మలీ ఖోల్గడే మరియు అరుణా సాయిరామ్ ప్రారంభించారు.
అత్యున్నత ప్రతిభ కనబరిచిన 100 మంది ఫైనలిస్ట్‌లకు 25 లక్షల రూపాయల విలువ కలిగిన స్కాలర్షిప్లను అందిస్తున్నారు. వీటిలో అత్యున్నత నాణ్యత కలిగిన మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరియు నగదు అవార్డులు సైతం భాగంగా ఉంటాయి. ఈ ఫైనలిస్ట్‌లు ప్రస్తుతం యంగ్ ఆర్టిస్ట్ అడ్వాన్స్డ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ (యాంప్)లో చేరతారు. అక్కడ వీరు ఎంచుకున్న రంగాలలో తగిన సలహాలు ఇవ్వబడతాయి. సంగీతం మరియు నృత్య ఘనాపాటీలు అయినటువంటి డాక్టర్ ఎల్ సుబ్రమణియం, కవితా కృష్ణమూర్తి మరియు మాధవి ముద్గల్ లు పాల్గొన్న అభ్యర్థులకు సలహాలిచ్చేందుకు సమ్మతి తెలియజేశారు. అదనంగా, పలు రంగాలలో నిష్ణాతులైనటువంటి రుక్మిణి విజయకుమార్ (భరతనాట్యం), అనుపమ భగవత్ (సితార్/సరోద్), నిఖిత గాంధీ(భారతీయ మరియు పాశ్చాత్య వోకల్), సాగర్ బోరా (హిప్–హాప్) వంటి వారు పలు విభాగాలలో ఆ విభాగానికి ప్రత్యేకమైన సదస్సులు నిర్వహిస్తుంటారు. అసాధారణ ప్రతిభావంతుల వేదికగా ఫైనల్ ఉండటమే కాదు, ఆ సమయానికి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్–19 పరిస్ధితులను బట్టి నిర్వహించనున్నారు.
‘‘ఈ అసాధారణ ప్రతిభావంతులను వెలికితీసే ప్రక్రియకు సాక్షీభూతంగా నిలువడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాం మరియు ఈ ఎంపికైన ఫైనలిస్ట్‌లను ప్రకటించడం పట్ల గర్వంగా ఉన్నాం. ఈ ప్రయత్నంలో దయతో మాతో చేతులు కలిపిన మెంటార్లు మరియు న్యాయనిర్ణేతలకు మేము ధన్యవాదములు తెలుపుతున్నాం’’ అని కవితాఅయ్యర్, కో–ఫౌండర్, యంగ్ ఆర్టిస్ట్ అన్నారు. యంగ్ఆర్టిస్ట్ సీజన్ 1కు అసాధారణ స్పందనను అందుకున్నాం. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అపూర్వమైఎంట్రీలను అందుకుంది. ఉజ్జయిన్ నుంచి ఇంఫాల్ వరకూ మరియు రాజధాని నగరం ఢిల్లీ నుంచి సాంస్కృతికంగా మహోన్నతమైన నగరం అయిన దిమాపూర్ వరకూ, నార్త్ 24 పరగణాస్ నుంచి ఉడుపి మరియు కొజికోడ్ వరకూ పలు ప్రాంతాల నుంచి అభ్యర్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్లోకి వెళ్లడం మరియు చాలామందికి కళ అనేది విలాసంగా మారడంతో మేము ఈ పోటీద్వారా అత్యున్నత స్థానం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాము మరియు ఊహాతీత రీతిలో ఈ ఆడిషన్స్‌ను నిర్వహిస్తున్నాము. ఫైనలిస్ట్‌లు అసాధారణ ప్రతిభను చూపడంతో పాటుగా తమ సంబంధిత రంగాలలో అసాధారణ ప్రతిభను చూపారు మరియు కళలను అనుసరించడం పట్ల తమ అచంచలమైన అభిరుచిని తమదైన మార్గాలలో వారు వ్యక్తీకరించారు. కళాకారుల కుటుంబాల నుంచి విద్యార్థులు రావడంతో పాటుగా నృత్యం పట్ల తమ అభిరుచిని వ్యక్తీకరించుకునే పెసులుబాటు లేని వ్యక్తులనూ విభిన్న ప్రాంతాల నుంచి చూశాము. భారతదేశపు అత్యుత్తమ ప్రతిభావంతులను వేదికే క్రమంలో వేలాది కథలకు మేము సాక్షిగా నిలువడంతో పాటుగా ఒక్క విషయం మాత్రం నేర్చుకున్నాము – అది కళకు ఎలాంటి హద్దులూ లేవు, వివక్షా లేదు. ఎవరైనా సరే కళాకారులు కావొచ్చు ! ‘‘భారతదేశంలో యువ ప్రతిభావంతులలో దాగిన సామర్ధ్యం వెలికి తీయడం మరియు వారి ప్రతిభను గుర్తించేందుకు జాతీయ స్థాయి వేదికను ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో పాటుగా వారి నైపుణ్యానికి తగిన శిక్షణ అందించేందుకు తగిన అవకాశాలను అందించాలని యంగ్ ఆర్టిస్ట్‌ను ఏర్పాటుచేశారు. అంతేకాదు, మెంటార్షిప్ కార్యక్రమం మరియు వైవిధ్యమైన కళారూపాలతో కలిసి పనిచేసే అవకాశంతో మేము వారి జ్ఞానం మరియు వ్యాప్తిని మరింత విస్తృతపరచడంలో ఖచ్చితంగా సహాయపడగలమని భావిస్తున్నాము’’ అని సందీప్ సింఘాల్, ట్రస్టీ –సిఫ్ అన్నారు. మాస్టర్ క్లాస్‌లు, వర్క్‌షాప్‌ల సమ్మేళనంగా యాంప్ ఉంటుంది మరియు ఫైనల్ ప్రదర్శనకు సిద్ధం కావడంలో సహచర యువ కళాకారుల భాగస్వామ్యాలు కూడా భాగంగా ఉంటాయి. యంగ్ ఆర్టిస్ట్‌లో గౌరవనీయులు, నిష్ణాతులతో కూడిన న్యాయనిర్ణేతల బృందం ఉంది. వీరు కార్యక్రమ ఆరంభం నాటి నుంచి న్యాయనిర్ణయ ప్రక్రియలో భాగం కావడంతో పాటుగా ఈ నిష్ణాతులు యాంప్ కోసం వర్క్‌షాప్‌లను 20 విభాగాలలో ప్రతి ఒక్కదానికీ నిర్వహిస్తున్నారు.
“యంగ్ ఆర్టిస్ట్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ కోసం నేను వీరితో కలువడం పట్ల సంతోషంగా ఉన్నాను. భారతదేశంలో వెలుగులోకి రాకుండా ఉన్న ప్రతిభావంతులు ఎందరో ఉన్నారు. ఈ ఔత్సాహిక కళాకారులను కలుసుకోవడం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సిఫ్ను నేను ప్రశంసిస్తున్నాను. యువ కళాకారులను గుర్తించేందుకు వీరు అద్భుతంగా కృషి చేస్తుండటమే కాదు, మన దేశపు ప్రతిభావంతులైన యువతకు తగిన శిక్షణను అందిస్తున్నారు అని డాక్టర్ ఎల్ సుబ్రమణియం”, యంగ్ ఆర్టిస్ట్ మెంటార్ అన్నారు. ఆర్ట్స్ విద్యలో గేమ్‌ఛేంజర్‌గా యంగ్ ఆరిస్ట్ అడ్వాన్స్డ్ మెంటార్షిప్ కార్యక్రమం నిలువడంతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులకు తగిన అవకాశాలను అందిస్తూనే, ఒకే తరహా ఆలోచనలు కలిగిన కళాకారులతో కూడిన కమ్యూనిటీలను నిర్మించనున్నాం. ఎంపికైన 100 మంది ఫైనలిస్ట్‌ల జాబితాను తెలుసుకునేందుకు యంగ్ ఆర్టిస్ట్ వెబ్సైట్ website చూడవచ్చు.
యంగ్ ఆర్టిస్ట్ ప్రయాణం : https://youtu.be/kwVrSloA_v0