హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు. గౌరవనీయులైన నాగబాబు గారికి అంటూ ట్వీట్ చేశారు. 'మీ తమ్ముడి మీద ఉన్న ప్రేమ నాకు అర్థమైంది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు' అంటూ చురకలంటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటూ పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని ప్రకాశ్ రాజ్ విమర్శించడం, ఆపై నాగబాబు వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm