హైదరాబాద్ : నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యతో డిసెంబర్ 9న పెళ్లి జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనున్న ఈ పెళ్లి వేడుకల పనిలో నాగబాబు కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే హల్దీ వేడుక పూర్తయింది. మెహందీ, సంగీత్ వేడుకలూ జరగనున్నాయి. పెళ్లి నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అంతా నిహారికతో దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిహారిక, చైతన్యతో కలిసి శ్రీజ, సుస్మిత, స్నేహా రెడ్డి, శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ వంటి పలువురు ప్రముఖులు ఫొటోలు దిగారు.
Mon Jan 19, 2015 06:51 pm