హైదరాబాద్ : పాక్ మాజీ ప్రధాని గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం రావల్పిండిలోని ఓ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మీర్ జఫారుల్లా ఖాన్ జమాలి కన్నుమూశారు. 76 ఏళ్ల జమాలీ కొద్ది రోజుల క్రితం గుండెపోటుకు గురికావడంతో.. రావల్పిండిలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ (ఏఎఫ్‌ఐసీ- ఎన్ఐహెచ్‌డీ)లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ వస్తున్నారు. కాగా జమాలి ఆరోగ్యం మరింత విషమించి మరోసారి గుండెపోటు రావడంతో బుధవారం సాయంత్రం కన్నుమూశారు.
Mon Jan 19, 2015 06:51 pm