హైదరాబాద్ : కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం సాయంత్రం బాగ్బజార్ ప్రాంతంలోని కాలనీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన అధికారులు 20 అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా సమీప మురికివాడలోని పలు ఇండ్లు కాలిపోయాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm