హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై లైంగికదాడి చేసిన ఓ బ్యాంక్ మేనేజర్ దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. ఇండోర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మొహాలీకి చెందిన ఓ మైనర్‌కు స్నేహితురాలి ద్వారా 53 ఏళ్ల ఓ బ్యాంక్ మేనేజర్‌తో పరిచయమైంది. అతడు మైనర్‌ను అప్పుడప్పుడు షాపింగ్ తీసుకెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు హోటల్ గదికి తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడి చేశాడు. అక్కడ జరిగినదంత వీడియోలో రికార్డు చేశాడు.
ఆ తర్వాత నుంచి వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడు. దీంతో విసుగుచెందిన మైనర్ పోలీసులను ఆశ్రయించింది. బ్యాంక్ మేనేజర్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ తన స్నేహితురాలిపై కూడా కేసు పెట్టడంతో ఆమెపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 25,2021 07:08PM