Jan 25,2021 07:47PM
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12మందికి గాయాలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం మర్లపల్లి వద్ద సోమవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. మహారాష్ట్ర వాసులు ఆలయానికి వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో వాహనం బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
Recomended For You