Jan 25,2021 08:59PM
హైదరాబాద్ : దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల కొత్తగా పార్టీ పెడుతున్నారంటూ మీడియాలో వచ్చిన కథనం కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై వైఎస్ షర్మిల స్వయంగా స్పందించారు. దిన పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, అవాస్తవాలను రాసిన పత్రిక, చానల్ పై చట్టపరమైన చర్యలకు తాము వెనుకాడబోమని షర్మిల హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. తమ కుటుంబాన్ని టార్గెట్ చేసేలా ఆ పత్రికలో రాతలు ఉన్నాయని ఆరోపించారు.
Recomended For You