Jan 25,2021 10:07PM
హైదరాబాద్ : ఆర్మీకి చెందిన ఒక హెలికాప్టర్ సోమవారం కూలిపోయింది. జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా లఖన్‌పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌లోని ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఒక పైలట్ మరణించారు. మరో పైలట్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన ధ్రువ్ ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక లోపంతో కూలినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై ఆర్మీ అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
Recomended For You