ఖమ్మం: పెళ్లి బృందానికి చెందిన బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఖమ్మం జిల్లా కొణిచర్ల దగ్గర ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm