ఢిల్లీ: యమునా నదిపై విషపు నురగలు పేరుకుపోతున్నాయి. దీనికి కాలుష్యమే ప్రధానకారణమని పర్యావరణ విశ్లేషకులు అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతోపాటు నీటి కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య నియంత్రనకు తగిన చర్యలు తీసుకొవాలని పర్యావరణవేత్తలు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టకపోతే ఈ సమస్య ఏటికేడు మరింత పెరుగుతుందని ఢిల్లీ వాసులు ఆందోళన చెందుతున్నారు. వివిధ పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలను నదుల్లోకి వదులుతుండటంతో నదుల్లో నీరంతా కలుషితంగా మారిపోతున్నది. పరిశ్రమల నుంచి వచ్చి చేరే విష రసాయనాల కారణంగా నీటి ఉపరితలంపై తెల్లని విషపు నురగలు పేరుకుపోతున్నాయి. తాజాగా ఐటీవో ఏరియాలో యుమునా నదిపై విషపు నురగలు పేరుకున్నాయి. ఈ విషపు నురగలు ఆకాశంలోని మబ్బులను తలపిస్తున్నాయి.
Delhi: Toxic foam was seen floating on the surface of the river Yamuna at ITO today pic.twitter.com/oIp172TDxv
— ANI (@ANI) February 23, 2021
Recomended For You