హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఓ మహిళా వాలంటీర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు. ద్వారకాతిరుమల మండలం రాజుపాలెం వాలంటరీగా పనిచేస్తున్నారు కంకిపాటి అన్నామణి. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాజుపాలెం పంచాయతీలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. ఇదే సమయంలో.. వాలంటీర్ అన్నామణి టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసిందంటూ ఎమ్మెల్యేకి ఫిర్యాదులు అందాయి. దీంతో, నేరుగా వాలంటీర్‌కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే వెంకట్రావు నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావ్ అంటూ బెదిరింపులకు దిగారు మహిళా వాలంటీర్‌తో అసభ్య పదజాలంతో మాట్లాడారు సదరు ఎమ్మెల్యే. దేవరపల్లి క్యాంప్ ఆఫీసుకి వచ్చి వివరణ ఇవ్వాలని వాలంటీర్‌ను ఆదేశించారు ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడింది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 02,2021 05:58PM