హైదరాబాద్ : బుల్లెట్ మోటార్ సైకిల్ వెళుతుంటే దడదడ దడదడ మంటూ మోత మోగిపోతుంది. ఆ విధమైన బీటింగ్ కోసం ప్రత్యేకమైన సైలెన్సర్లను బిగిస్తుంటారు. అయితే ఈ తరహా సైలెన్సర్లు విపరీతమైన శబ్దకాలుష్యానికి కారణమవుతుండడంతో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. పట్టణంలో అధిక ధ్వని చేస్తున్న బైకులను గుర్తించి వాటి సైలెన్సర్లను తొలగించారు. వాటన్నింటినీ ఓ రోడ్డు రోలర్ సాయంతో తొక్కించి, మళ్లీ పనికిరాకుండా చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm