- నిజామాబాద్ జిల్లాను వేదికగా ఎంచుకోవడం గర్వకారణం
- టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్
నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రమైనప్పటికీ క్రీడా ప్రాతినిధ్యలలో ప్రపంచ దేశాల లోనే ఖండాంతరాల్లో ప్రాతినిధ్యాలు ఉన్నాయని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అండర్ ఆర్మ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర సంఘ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ క్రికెట్ అసోసియేషన్ ను స్థాపించి రాష్ట్ర సంఘ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించేందుకు నిజామాబాద్ జిల్లాను వేదికగా చేసుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ క్రీడను మరింత ప్రాచుర్యం చేస్తూ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా జిల్లా, రాష్ట్ర సంఘ బాధ్యులు పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ ఆసక్తి ఉన్న క్రీడాకారులను తీర్చిదిద్దాలని ఆయన కోరారు. అదేవిధంగా క్రీడాకారులు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రయోజకులుగా ఎదగాలన్నారు ఆయన ఆకాంక్షించారు. ఈ క్రీడ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని ఆయన అన్నారు. ఇందులో భాగంగా అండర్ ఆర్మ్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఉత్తం ఉగాడే చేతుల మీదుగా జిల్లాకు చెందిన మేకల గంగాధర్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా, బాల్కొండ మండలానికి చెందిన సిహెచ్ ప్రసాద్ ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. త్వరలో పూర్తి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని గంగాధర్ తెలిపారు. అదేవిధంగా జిల్లా సంఘం కార్యవర్గాన్ని సైతం సిద్ధం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా గోవాలో జరిగిన జాతీయ స్థాయి టోర్నీలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచి చాంపియన్‌షిప్‌ను సాధించిందని గంగాధర్ తెలిపారు. ఈ టోర్నీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ముఖ్య అతిథుల చేతులమీదుగా సన్మానించారు. అదేవిధంగా రాష్ట్ర సంఘం అధ్యక్షుడిగా గంగాధర్ ను నియమించడం పట్ల టీఎన్జీవో సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందించారు. గంగాధర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశం లో జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ దాస్ , విజయ్ మోర్, చామకూర బాగా రెడ్డి, కృష్ణంరాజు, సంజీవ్ కుమార్, టీ ఎన్ జి ఓస్ ప్రతినిధి నారాయణ్ రెడ్డి, పోల శ్రీనివాస్ శెట్టి, వ్యాయమ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 11 Apr,2021 08:10PM