నవతెలంగాణ కంటేశ్వర్
జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆన్స్ చర్చ్ లో గురు పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రోమన్ క్యాథలిక్ డయాసిస్ కి చెందిన పలువురు గురువులు తమ 10 సంవత్సరాల ఆధ్యాత్మిక సేవలను పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక చర్చి విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ మాదాను అంథోని ఆయన ఆధ్యాత్మిక సేవలో కొనసాగుతూ సంఘాన్ని పటిష్టం చేయడంతో పాటు క్రైస్తవ ఆధ్యాత్మికతను అందిస్తూ ధన్యచరిత గల ధన్యాత్ముడు అని స్థానిక సంఘ సభ్యులు ఆయన సేవలను కొనియాడారు. అంతే కాకుండా వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ ప్రగతిని సాధించాలంటే ఆర్థిక వనరుల కంటే ముందు ఆధ్యాత్మిక వరాలు ముఖ్యం అని విద్య, విజ్ఞానం, వికాసం కంటే ముందు విశ్వాస, వికాసం ఆవశ్యకం అని భక్తులకు సువార్త పరిచర్య పరిమళాలను విరాజిల్లుతూ అనుకువతో, ఎంతో ఓర్పుతో, నిరాడంబరంతో విశ్వగురువు గా అందరి గుండెల్లో కొలువైన మేధా వృక్షమా అని పొగిడారు. అయితే ఫాదర్ ఆంటోనీ 2011 - 13 సంవత్సరంలో హైదరాబాదులోని మౌలాలిలో గల సెంట్ జోసెఫ్ చర్చ్ లో అసిస్టెంట్ విచారణ గురువుగా సేవలందించారు. అనంతరం 2013 - 14 సంవత్సరంలో సికింద్రాబాద్ లోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో అసిస్టెంట్ హెడ్మాస్టర్ గా, వర్చువల్ హెల్ప్ చర్చ్ అసిస్టెంట్ విచారణ గురువుగా, సికింద్రాబాద్లోని బిషప్ హౌస్ లో ఆయన సేవలను అందించారు. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు తూప్రాన్ లోని ఫాతిమా చర్చ్ లో ఐదు సంవత్సరాలు విచారణ కర్తగా సేవలందించారు. అనంతరం 2019 మే 26న స్థానిక సెంట్ ఆన్స్ చర్చ్ విచారణ గురువుగా బాధ్యతలను స్వీకరించి నేటికీ ఆయన ఆధ్యాత్మిక సేవలో కొనసాగుతున్నారు. ఫాదర్ ఆంతోని తోపాటు రెవరెండ్ ఫాదర్ జూడ్ రాజ్, రెవరెండ్ ఫాదర్ మాదాను ఆల్ ఫోన్స్, రెవరెండ్ ఫాదర్ గోలమారి ఆరోగ్య రెడ్డి, రెవరెండ్ ఫాదర్ వినయ్ లను సైతం స్థానిక చర్చ్ కమిటీ, చర్చ్ కౌన్సిల్ మెంబర్లు, యూత్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రాంగణంలో కేక్ కట్ చేసి వేడుకగా ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల హృదయ సుపీరియర్ సిస్టర్ రెవరెండ్ ఫాతిమా బోయపాటి, హెడ్ మిస్ట్రెస్ రెవరెండ్ సిస్టర్ మార్గరెట్ కొమ్మా రెడ్డి, కాన్వెంట్ సిస్టర్ లు, చర్చ్ కౌన్సిల్ మెంబర్లు కిరీటయ్యా, లారెన్స్, వై ఆర్ డేవిడ్, హ్యారీ విన్సెంట్, బాలస్వామి, డామ్నిక్ సావీయో, ఆగస్టీన్, ఆగ్నెస్ జోసఫ్, మరియా పుష్ప తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 11 Apr,2021 08:10PM