న్యూఢిల్లీ : రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యాక్సిన్‌కు సోమవారం నిపుణుల కమిటీ ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఇండియాలో వినియోగానికి అందుబాటులోకి వచ్చిన మూడో వ్యాక్సిన్‌గా స్పుత్నిక్-వి నిలిచింది. తమ వ్యాక్సిన్‌కు అనుమతించిన 60వ దేశం ఇండియా అని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రభుత్వ రెగ్యులేటర్లు అనుమతుల సంఖ్య ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో స్పుత్నిక్ రెండో స్థానంలో నిలుస్తుందని తెలిపింది. ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తయారు చేస్తున్న ఈ టీకా సామర్థ్యం 91.6 శాతంగా తేలిన విషయం తెలిసిందే. స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు ఈ నెల చివరిలోపు ఇండియాలో అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తోపాటు మరో నాలుగు ఫార్మా కంపెనీలు ఈ వ్యాక్సిన్లను తయారు చేయనున్నాయి. ఏడాదికి 85 కోట్ల వ్యాక్సిన్ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 13 Apr,2021 10:57AM