హైదరాబాద్ : ఇటీవలే విడుదల అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు టాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా మరో స్టార్ హీరో పవన్ ను హాగ్ చేసుకొని మరి వకీల్ సాబ్ సినిమాను ప్రశంసించాడని మల్టీటాలెంట్ నటుడు ప్రకాష్ రాజ్ తెలిపాడు. వకీల్ సాబ్ ప్రమోషన్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ప్రకాష్ రాజ్.. వకీల్ సాబ్ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి బాగా నచ్చిందని తెలిపారు. దింతో తారక్ నేరుగా పవన్ను కలిసి కౌగిలించుకుని మరీ అభినందనలు తెలియజేశాడని ప్రకాష్ రాజ్ తెలిపారు. కాగా ఇదివరకు సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వకీల్ సాబ్ సినిమాను ప్రశంసించిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm