హైదరాబాద్ : స్పుత్నిక్-వి టీకా మన దేశంలో ఒకటి, రెండు నెలల తర్వాతే అందుబాటులోకి రానుంది. ఈ టీకాను జూన్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ను మొదట రష్యా నుంచి దిగుమతి చేసుకుని సరఫరా చేస్తామని డాక్టర్ రెడ్డీస్ సహ చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ బుధవారం మీడియాకు వివరించారు. ఆ తర్వాత ఇక్కడే ఉత్పత్తి చేస్తామన్నారు. భారత్లో వ్యాక్సిన్ తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు 2021-22 రెండో త్రైమాసికం నుంచి ఇక్కడ టీకాను ఉత్పత్తి చేస్తాయని వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm