లండన్: ఆన్లైన్లో ఆర్డర్ ఒకటి ఇస్తే.. మరో వస్తువు మన ఇంటికి రావడం చూస్తుంటాం. ప్రాడక్ట్ ఇంటికి వచ్చే వరకు టెన్షన్ తప్పదు. కానీ బ్రిటన్‌లో జేమ్స్ అనే వ్యక్తిని అదృష్టం వరించింది. ఆన్లైన్లో యాపిల్ పండ్ల కోసం ఆర్డర్ ఇవ్వగా.. అతని ఇంటికి ఆ పండ్లతో పాటు యాపిల్ ఐఫోన్ కూడా వచ్చింది. ట్వికెన్‌హామ్‌లో ఉండే 50 ఏళ్ల జేమ్స్ ఆ ఐఫోన్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. నిజానికి ఈస్టర్ సందర్భంగా ఏదైనా ప్రాంక్ చేశారేమో అని భావించాడు. కానీ టెస్కో మార్కెట్ కంపెనీ మాత్రం జేమ్స్‌ను సర్ప్రైజ్ చేసింది. యాపిల్ పండ్లతో పాటు ఐఫోన్ స్పెషల్ ఎడిషన్ ఫోన్‌ను గిఫ్ట్‌గా డెలివరీలో పంపింది. టెస్కో గ్రోసరీ తన ప్రమోషనల్ క్యాంపేన్‌లో భాగంగా యాపిల్ పండ్లతో పాటు ఐఫోన్‌ను ఆ కస్టమర్‌కు డెలివరీ చేసినట్టు తెలిసింది. సూపర్ సబ్‌స్టిట్యూట్ ఆఫర్ పేరుతో ఆ గిఫ్ట్ ఇచ్చారు. యాపిల్ ఐఫోన్లు, ఎయిర్‌పాడ్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా టెస్కో గిఫ్ట్‌గా ఇస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm