శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీనేత కూన రవికుమార్‌కు బెయిల్ మంజూరయింది. రాజాం సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం కూన రవికి బెయిల్ మంజూరు చేసింది. పెనుబర్తిలో ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగిన కొట్లాటలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన గురువారం ఉదయం పొందూరు పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm