హైదరాబాద్ : కూకట్ పల్లిలో ఓ బాలికపై దూరపు బంధువైన ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూసాపేట జనతానగర్లో నివాసముంటున్న జై బాలు (25), ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ బాలికను గత నెల 17న తన పుట్టిన రోజు ఉందని ఇంటికి పిలిపించుకొని లైంగికదాడి చేసి అర్ధనగ్నంగా ఓ సెల్ఫీ తీసి తన స్నేహితులకు పోస్టు చేశాడు.
ఆ ఫొటో బాలిక బంధువులకు చేరటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఈ 10న పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బలవంతంగా తనను లైంగికదాడి చేసినట్లు బాలిక ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు జై బాలు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Apr,2021 07:06PM