హైదరాబాద్: చార్జింగ్ పెట్టిన ఫోన్ పేలిపోయిన సంఘటనల గురించి మీరు వినే ఉంటారు. కానీ వాషింగ్ మెషీన్ పేలిన ఘటనల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా చదివారా? తాజాగా ఓ మహిళకు అలాంటి అనుభవమే ఒకటి ఎదురయింది. వాషింగ్ మెషీన్లో బట్టలను పెట్టి ఉతుకుతుండగా ఊహించని రీతిలో అది పేలిపోయింది. ఆ శబ్దానికి, అదే చేసిన బీభత్సానికి ఆ గది అంతా చిందరవందర అయిపోయిందని ఆ మహిళ చెప్పుకొచ్చింది.
ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన పోస్ట్ వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాషింగ్ మెషీన్లు కూడా పేలతాయా? ఇదెక్కడి విడ్డూరం? అంటూ నోరెళ్లబెడుతున్నారు. స్కాట్లాండ్ కు చెందిన లూరా బిరెల్ అనే మహిళ, బట్టలు ఉతికేందుకు యత్నించిన సమయంలో ఈ షాకింగ్ అనుభవం ఎదురయింది. ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో అసలేం జరిగిందో చెప్పుకొచ్చింది. వాషింగ్ మెషీన్ తో జాగ్రత్త, అది పేలుతుంది అని తనకు ఎవరూ ఇంతవరకు చెప్పలేదనీ, కానీ ఇకపై తాను స్నేహితులకు, సన్నిహితులకు ఇదే విషయం చెప్పాల్సి వస్తుందని ఆమె రాసుకొచ్చింది. వాషింగ్ మెషీన్లో బట్టలు వేసి, నీళ్లు నింపి స్విచాన్ చేశాననీ, కొద్ది సేపటికే బాంబు పేలినట్టు శబ్దం వచ్చి వాషింగ్ మెషీన్ పేలినట్టు లూరా ఆందోళన వ్యక్తం చేసింది. వాషింగ్ మెషీన్ నుంచి బాంబు లాంటి శబ్దం వచ్చింది. ఆ తర్వాత పొగ కూడా రావడం మొదలయింది.
అదృష్టవశాత్తూ తాను దగ్గరలోనే ఉన్నాననీ, అందుకే వెంటనే స్విచాఫ్ చేశానని లూరా వివరించింది. వాషింగ్ మెషీన్ తో జాగ్రత్తగా ఉండండంటూ ఆమె జాగ్రత్తలు చెబుతోంది. అది ఎందుకు పేలిందో? అసలేం జరిగిందో తనకు తెలియదనీ అంటోంది. ఏది ఏమైనా వాషింగ్ మెషీన్ పేలడం మాత్రం చాలా విచిత్రంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Apr,2021 11:13AM