న్యూఢిల్లీ: కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్‌లకు రూ.4500 కోట్లు ఇవ్వాలని నిర్ణయంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఇందులో రూ.3 వేల కోట్లను సీరమ్‌కు, రూ.1500 కోట్లను భారత్ బయోటెక్‌కు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
నెలకు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి తమకు రూ.3 వేల కోట్లు అవసరమని సీరమ్ సీఈవో అదర్ పూనావాలా ఈ మధ్యే ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి ఆర్థిక సాయం చేయడంతోపాటు వినూత్న విధానాలను కనుగొనడానికి వ్యాక్సిన్ తయారీదారులతో కలిసి ప్రభుత్వం పని చేస్తోందని పూనావాలా చెప్పారు. జూన్ నెలలోగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచాలని సీరమ్ భావిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 Apr,2021 04:56PM