హైదరాబాద్: అరుణ గ్రహంపై తొలిసారి హెలికాప్టర్ ఎగిరింది. భూమ్మీద కాకుండా మరో గ్రహం మీద ఎగిరిన తొలి హెలికాప్టర్‌గా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) రూపొందించిన ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ చరిత్ర సృష్టించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రయోగంలో.. నాసా తన మినీయేచర్ హెలికాఫ్టర్ ఇన్‌జెన్యూటీని అరుణ గ్రహంపై విజయవంతంగా నడిపింది. అరుణ గ్రహం ఉపరితలం నుంచి మూడు మీటర్ల ఎత్తులో ఇన్‌జెన్యూటీ ఎగిరినట్లు నాసా వెల్లడించింది. దాదాపు 30 సెకన్ల పాటు ప్రయాణించి.. అనంతరం విజయవంతంగా తిరిగి ల్యాండైంది.
Mon Jan 19, 2015 06:51 pm