హైదరాబాద్: అరుణ గ్రహంపైకి మరో అధ్భుతం ఆవిష్కృతం అయింది. నాసా పంపిన 'పెర్సెవరెన్స్' ఆ అద్భుతం సృష్టించింది! చరిత్రలోనే తొలిసారిగా మరో గ్రహంపై ఈ ఆరు చక్రాల రోవర్ ఆక్సిజన్‌ను తయారు చేసింది. అక్కడ కొంత కార్బన్-డై-ఆక్సైడ్‌ను సేకరించిన పెర్సెవరెన్స్.. దాని నుంచి ప్రాణవాయువును ఉత్పత్తి చేసినట్టు నాసా వెల్లడించింది.
'రోవర్ ముందుభాగం కుడి వైపున కారు బ్యాటరీ పరిమాణంలో గోల్డెన్ బాక్స్ ఉంది. దీన్ని మెకానికల్ ట్రీగా పిలుస్తారు. ఇది కార్బన్-డై-ఆక్సైడ్‌ను తీసుకుని విద్యుత్తు, రసాయనాల సాయంతో దాన్ని విడగొట్టింది. తద్వారా 5 గ్రాముల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసింది. ఒక వ్యోమగామి పది నిమిషాల పాటు శ్వాసించడానికి ఇది సరిపోతుంది. ఈ మార్స్ ఆక్సిజన్ (మాక్సి) ఈ బాక్స్ లోనే నిక్షిప్తమై ఉంది. గంటకు 10 గ్రాముల మేర ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ఇంజినీర్లు ఈ మెకానికల్ ట్రీను రూపొందించారు. ఈ లక్ష్యం చేరుకునేందుకు కృషి జరుగుతోంది. భవిష్యత్తులో అక్కడికి వెళ్లే వ్యోమగాములకు ఆక్సిజన్ కొరత ఉండదు. తిరుగు ప్రయాణం కోసం భూమి నుంచి పనిగట్టుకుని అంగారకుడిపైకి రాకెట్ ప్రొపెల్లంట్ను తీసుకెళ్లాల్సిన అవసరమూ తప్పుతుంది' అని నాసా స్పేస్ టెక్నాలజీ మిషన్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ జిమ్ రాయిటర్ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Apr,2021 03:53PM