హైదరాబాద్: లక్డీకాపూల్ వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కంటైనర్ అదుపు తప్పి బోల్తాపడింది. లక్డీకాపూల్ చౌరస్తాలో మలుపు తిరుగుతూ పక్కకు ఒరిగి భారీ కంటైనర్ పడిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జాం అయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm