హైదరాబాద్ : కుటుంబ కక్షలతో ఐదేండ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఈ దారుణ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెనుకొండ డీఎస్పీ రమ్య తెలిపిన వివరాల ప్రకారం.. గోళ్లాపురం పారిశ్రామికవాడలో ఓ మహిళ కార్మికురాలు పనిచేస్తున్నది. అదే పరిశ్రమలో గతంలో అజయ్ అనే వ్యక్తి కూడా పనిచేశాడు. కార్మికురాలు కుటుంబానికి, అజయ్ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉండేది. అయితే రెండు కుటుంబాల మధ్య ఇటీవల గొడవలు జరిగాయి. అయితే వారిపై అజయ్ కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 11న కార్మికురాలి ఐదేండ్ల కుమార్తె బహిర్భూమికి వెళ్లగా చిన్నారిని అజయ్ ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
దాంతో ఆ చిన్నారి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. వెంటనే బాలికను హిందూపురంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తర్వాత అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. అనంతరం బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడిని అరెస్టు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Oct,2021 10:03AM