హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఆదివారం నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 23న నామినేషన్లను పరిశీలించనున్నారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు తెలంగాణ భవన్ లో నామినేషన్లు స్వీకరించనున్నామని తెలిపారు. 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. 25న హెచ్ఐసీసీలో జరిగే ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Oct,2021 11:00AM