హైదరాబాద్ : ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో రాధేశ్యామ్ అప్ డేట్ల కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక త్వరలో తీరనుందని తెలుస్తోంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా 'రాధే శ్యామ్` టీజర్ విడుదల కానుందని సమాచారం. ఈ విషయంపై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇటీవలే ఈ సినిమా హీరోయిన్ పూజాహెగ్డే పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా టీజర్ ను కూడా విడుదల చేయడానికి మేకర్స్ సన్నహాలు చేస్తోందని సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm