Touchdown after 191 days in space for @Novitskiy_ISS and 12 days in space for two Russian filmmakers! More... https://t.co/CrQl3O1BUl pic.twitter.com/kzXlCTr0og
— International Space Station (@Space_Station) October 17, 2021
హైదరాబాద్ : అంతరిక్షంలో తొలిసారి ఓ చిత్రం షూటింగ్ కోసం వెళ్లిన రష్యన్ డైరెక్టర్, నటి 12 రోజుల తర్వాత ఆదివారం భూమిపై సురక్షితంగా తిరిగివచ్చారు. నటి యూలియా పెరెసిల్డ్, డైరెక్టర్ క్లిమ్ షిపెంకో లు ఆదివారం ఉదయం ఖజకిస్తాన్‌లో భూమిపైకి వచ్చారు. ద చాలెంజ్ అనే పేరుతో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ కోసం వీళ్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లారు. ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ఈ ల్యాండింగ్ వీడియోను షేర్ చేసింది. భూకక్ష్యలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వారు షూటింగ్ చేశారు.
వీళ్లతోపాటు కాస్మోనాట్ ఒలెగ్ నోవిట్స్కీ కూడా భూమిపై దిగారు. ఒలెగ్ ఆరు నెలల పాటు ఐఎస్ఎస్లో గడిపారు. సూయజ్ ఎంఎస్-18 స్పేస్‌క్రాఫ్ట్ వీళ్లను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చింది. ఈ నెలలోనే ఈ నటి, డైరెక్టర్ రష్యాలోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లారు.