హైదరాబాద్ : ఉత్తర్ప్రదేశ్ కోత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మూడేండ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగికదాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేండ్ల బాలిక తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. శుక్రవారం బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా స్థానికంగా నివసించే ఓ యువకుడు ఆమెను తన వెంట తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై లైంగికదాడి చేసి, గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని తన ఇంట్లో మంచం కింద దాచిపెట్టాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్టు.. నిందితుడికి 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది.
Mon Jan 19, 2015 06:51 pm