హైదరాబాద్: గురుకులాలు తెరిచేందుకు తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది. గురుకులాలు తెరవద్దన్న గత ఆదేశాలను హైకోర్టు సవరించింది. ఇంటర్ పరీక్షల దృష్ట్యా గురుకులాల ప్రారంభానికి అనుమతివ్వాలని ప్రభుత్వం కోరింది. విద్యాసంస్థల్లో కొవిడ్ నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఏజీ పేర్కొన్నారు. గురుకులాల్లో ఆఫ్లైన్, ఆన్లైన్ బోధన చేపట్టాలని తెలంగాణ హైకోర్టు సూచించింది.
Mon Jan 19, 2015 06:51 pm